టెస్ట్‌ల్లో జెర్సీ నంబర్లకు ఐసీసీ గ్రీన్‌సిగ్నల్


Sat,March 23, 2019 01:37 AM

న్యూఢిల్లీ: టెస్ట్‌ల్లో ఇక కొత్త రకం జెర్సీలను త్వరలో చూడబోతున్నాం. ఇన్నాళ్లుగా శ్వేత వర్ణ దుస్తులతో టెస్ట్‌లాడిన క్రికెటర్లు ఇకపై సరికొత్త రీతిలో అభిమానులను అలరించబోతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు నూతన ఉత్తేజం తీసుకొచ్చే ఉద్దేశంతో టెస్ట్‌లో జెర్సీ నంబర్లు, ఆటగాళ్ల పేర్లకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్లు జెర్సీ నంబర్లతో మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఐసీసీ తాజా నిర్ణయంతో ఆగస్టు 1 నుంచి మొదలయ్యే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భారత క్రికెటర్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. టెస్ట్ క్రికెట్‌ను మరింతగా అభిమానులకు చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లారె ఫర్లాంగ్ పేర్కొంది.

208

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles