ఆర్థర్‌ ఉంటానంటే.. ఇమ్రాన్‌ వద్దన్నాడు!


Mon,August 12, 2019 02:25 AM

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు తాజా మాజీ హెడ్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ మరో రెండేండ్లపాటు కొనసాగాలనుకున్నా.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అందుకు అంగీకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ లీగ్‌ దశలోనే వెనుదిరిగినా.. ఆర్థర్‌ మాత్రం మరో రెండేండ్లు కోచ్‌గా కొనసాగాలనుకున్నాడు. అయితే ఈ విషయం ప్రధాని దృష్టికి వెళ్లడంతో.. వరల్డ్‌కప్‌లో నిరాశజనక ప్రదర్శన అనంతరం శిక్షణ బృందాన్ని మార్చాల్సిందే అని ఇమ్రాన్‌ ఖాన్‌ తేల్చిచెప్పాడు. దీంతో పీసీబీ పాత బృందానికి గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మని ఈ అంశంపై ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. చీఫ్‌ కోచ్‌ పదవిపై పాక్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మొహసిన్‌ ఖాన్‌ ఆసక్తి చూపుతున్నాడు.

362

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles