తొలి రోజే డజను పతకాలు


Tue,September 10, 2019 12:34 AM

న్యూఢిల్లీ: ట్రాక్ ఆసియా కప్‌లో భారత్ విజృంభించింది. పోటీల తొలిరోజే నాలుగు స్వర్ణాలు సహా 12 పతకాలు ఖాతాలో వేసుకుంది. సోమవారం ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రారంభమైన పోటీల్లో రొనాల్డో లైతొన్జమ్ రెండు స్వర్ణాలు సాధించాడు. తొలుత పురుషుల జూనియర్ టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో జట్టుతో కలిసి పసిడి నెగ్గిన రొనాల్డో.. అనంతరం 1 కిలోమీటర్ టైమ్ ట్రయల్ ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో త్రియాషా పాల్ కూడా తొలి రోజే రెండు స్వర్ణాలు సాధించింది. జూనియర్ మహిళల స్ప్రింట్ ఈవెంట్‌లో నిఖిత నిషాతో కలిసి బంగారు పతకం నెగ్గిన త్రియాషా.. 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. నిషాకు రజ తం దక్కింది. ఈ టోర్నీలో 12 దేశాలకు చెంది న అథ్లెట్లు పాల్గొంటున్నారు.

298

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles