జపాన్‌తో భారత్ తొలి పోరు


Sat,March 23, 2019 01:48 AM

manpreet

- నేటి నుంచి సుల్తాన్ అజ్లాన్‌షా హాకీటోర్నీ

ఇఫో(మలేషియా): భారత హాకీ జట్టు సత్తాచాటేందుకు సిద్ధమైంది. శనివారం నుంచి మొదలవుతున్న సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో శుభారంభంతో గతేడాది వైఫల్యాలకు ము గింపు పలుకాలన్న పట్టుదలతో ఉన్నది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తోడు ప్రతిభ కల్గిన కుర్రాళ్లకు చోటు కల్పిస్తూ ప్రత్యర్థి జట్లకు పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. భారత్‌తో సహా ఆతిథ్య మలేషియా కెనడా, జపాన్, పోలాండ్, దక్షిణాకొరియా టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్‌లో శనివారం జపాన్‌తో తలపడుతుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆతిథ్య మలేషియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. క్రితంసారి టోర్నీని ఐదో స్థానంతో ముగించిన భారత్ ఈసారి ఎలాగైనా కప్ గెలిచేందుకు సర్వశక్తులతోసిద్ధమైంది.

359

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles