ట్రాక్ ఆసియా కప్‌లో భారత్ టాప్


Thu,September 12, 2019 12:13 AM

న్యూఢిల్లీ: ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్‌లో ఆతిథ్య భారత్ పతకాల వేటలో టాప్ లేపింది. బుధవారంతో ముగిసిన టోర్నీలో భారత సైక్లిస్టులు 10 స్వర్ణాలు సహా 8 రజతాలు, 7 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఉబ్బెకిస్థాన్(4 స్వర్ణాలు, 3 రజతాలు), మలేషియా(4 స్వర్ణాలు, రజతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జూనియర్ పురుషుల కైరిన్ ఈవెంటులో రొనాల్డో లైతోన్‌జోమ్ మరోసారి స్వర్ణ పతకంతో మెరిశాడు. టోర్నీలో రొనాల్డోకు ఇది నాలుగో పసిడి పతకం కావడం విశేషం. ఐదు రౌండ్ల పాటు జరిగిన కైరిన్ ఈవెంటులో రొనాల్డో మొదటి స్థానంలో నిలువగా, అర్లాబెక్, అలెగ్జాండర్ సఫరోవ్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. భారత సైక్లిస్టుల ప్రదర్శనను సమాఖ్య అధ్యక్షుడు ఓంకార్ సింగ్ అభినందించారు.

318

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles