భారత్ ఐదోసారి...సాఫ్ టైటిల్ కైవసం


Sat,March 23, 2019 02:28 AM

saff-cup
బిరాట్‌నగర్: సాఫ్ మహిళల చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు తమకు తిరుగులేదని చాటింది. వరుసగా ఐదో సారి టైటిల్ దక్కించుకుని కొత్త చరిత్ర లిఖించింది. శుక్రవారం ఆతిథ్య నేపాల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. సాఫ్ టోర్నీలో గత 23 మ్యాచ్‌లుగా అపజయమెరుగని రికార్డును కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నది. షాహిద్ రంగశాల స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో టీమ్‌ఇండియా తరఫున దాల్మియా చిబ్బర్, గ్రేస్ దాంగ్మెయి, అంజు తమాంగ్ గోల్స్ చేయగా, సబిత్రా నేపాల్‌కు ఏకైక గోల్ అందించింది. మ్యాచ్ 14వ నిమిషంలో నేపాల్ ైస్ట్రెకర్ మంజలీ కుమార్..గోల్ చేసినంత పనిచేసింది. మరోవైపు చిబ్బర్ 30 అడుగుల దూరం నుంచి ఫ్రీకిక్ బుల్లెట్‌లా దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు 1-0 ఆధిక్యం దక్కింది. 34వ నిమిషంలో సబిత్రా కొట్టిన గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. కీలకమైన ద్వితీయార్ధంలో దూకుడు ప్రదర్శించిన భారత్ తమదైన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో 63వ నిమిషంలో ైస్ట్రెకర్ గ్రేస్ కొట్టిన గోల్‌తో ఆధిక్యం 2-1కు పెరిగింది. నేపాల్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా టీమ్‌ఇండియా అదే రీతిలో జోరు కనబరిచింది. 78వ నిమిషంలో సబ్‌స్ట్యూట్‌గా బరిలోకి దిగిన అంజు తమాంగ్ భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చగా, నేపాల్ గోల్ ప్రయత్నాలు నెరవేరలేదు.

287

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles