భారత్‌ బోణీ


Thu,October 10, 2019 12:47 AM

priya

- అరంగేట్రంలో అదరగొట్టిన పునియా
- సిరీస్‌లో 1-0తో ముందంజ
వడోదర: సొంతగడ్డపై భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం కనబరుస్తుంటే.. మహిళల జట్టు సఫారీ మహిళలను ఆటాడుకుంటున్నది. ఇప్పటికే టీ20 సిరీస్‌ చేజిక్కించుకున్న భారత్‌.. వన్డే ఫార్మాట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో మిథాలీ బృందం 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టును చిత్తుచేసింది. సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి (3/33), ఏక్తా బిస్త్‌ (2/28), శిఖా పాండే (2/38), పూనమ్‌ యాదవ్‌ (2/32) ధాటికి టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 45.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. మారిజన్నె కాప్‌ (54) అర్ధశతకంతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో తొలి వన్డే ఆడుతున్న ప్రియా పునియా (124 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (65 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో.. భారత్‌ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన కాలి బొటనవేలి గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరం కావడంతో ఆమె స్థానంలో బరిలో దిగిన ప్రియా అరంగేట్రంలోనే ఫిఫ్టీ కొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగనుంది.

287

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles