యువ షట్లర్ల పతకాల పంట


Mon,August 12, 2019 02:40 AM

samiya
పజార్డ్‌జిక్‌(బల్గేరియా): భారత యువ షట్లర్లు బల్గేరియన్‌ జూనియన్‌ అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు. మూడు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్య పతకాలతో సత్తాచాటారు. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత యువ కెరటం సామియా ఫారుకీ 9-21, 21-12, 22-20తో రెండో సీడ్‌ షపోవలోవా(రష్యా)పై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఎడ్విన్‌ జాయ్‌-శృతి మిశ్రా జోడీ 21-14, 21-17తో రెండో సీడ్‌ బ్రెండన్‌ జీ హావ్‌-అబ్బీగిల్‌ (బ్రిటన్‌) ద్వయాన్ని ఓడించి పసిడి చేజిక్కించుకుంది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో భారత జోడీ తనీషా-అదితి 21-15, 18-21, 21-18తో టాప్‌ సీడ్‌ జోడీ ఎర్కెటిన్‌-జెహ్రా ఎర్డ్‌ఫమ్‌ (టర్కీ)ను మట్టికరిపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో ఇషాన్‌ భట్నాగర్‌, విష్ణువర్ధన్‌ ద్వయం 19-21, 18-21 తేడాతో టాప్‌ సీడ్‌ విలియమ్‌ జోన్స్‌, బ్రెండెన్‌ జీ హావ్‌ చేతిలో ఓడిరజతాన్ని దక్కించుకుంది.

323

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles