జిమ్నాస్ట్‌లకు నిరాశ


Mon,October 7, 2019 03:51 AM

aruna
స్టట్‌గార్ట్‌ (జర్మనీ): ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు నిరాశపరిచారు. ఆదివారం ఇక్కడ జరిగిన వ్యక్తిగత విభాగాల పోటీల్లో ఒక్కరు కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. మహిళల ఆల్‌రౌండ్‌ క్వాలిఫికేషన్‌లో 45.832, 45.248 స్కోర్లు చేసిన ప్రణతీ నాయక్‌, ప్రణతీ దాస్‌ వరుసగా 127, 132వ స్థానాల్లో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు. వాల్ట్‌ ఈవెంట్‌లో ప్రణతీ నాయక్‌ 27వ స్థానంతో నిరాశపరిచింది. అన్‌ఈవెన్‌ బార్స్‌ క్వాలిఫికేషన్‌ పోటీలో తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణా రెడ్డి (8.925), ప్రణతీ దాస్‌ (9.916), ప్రణతీ నాయక్‌ (10.566) వరుసగా 193, 182, 164వ స్థానాల్లో నిలిచారు. బ్యాలెన్స్‌ బీమ్‌ క్వాలిఫికేషన్‌ పోటీల్లోనూ సేమ్‌సీన్‌ రిపీట్‌ అయింది.

227

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles