సెమీస్‌కు నాగల్‌


Sun,October 6, 2019 01:55 AM

క్యాంపినాస్‌ (బ్రెజిల్‌): భారత టెన్నిస్‌ ఆటగాడు సుమీత్‌ నాగల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే బ్యూనస్‌ ఎయిర్స్‌ టైటిల్‌తో మెరిసిన ఈ యువ సంచలనం.. క్యాంపినాస్‌ ఏటీపీ చాలెంజర్‌లోనూ సెమీఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సుమీత్‌ 7-6, 7-5 తేడాతో ఫ్రాన్సికో సెరుండోలో(అర్జెంటీనా)పై విజ యం సాధించాడు. ఆరో సీడ్‌గా బరిలో దిగిన నాగల్‌.. సెమీస్‌లో జువాన్‌ ఫాబ్లో(అర్జెంటీనా)తో తలపడనున్నాడు.

జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో జొకో

గాయం కారణంగా యూఎస్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్‌లోనే వైదొలిగిన ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌(సెర్బియా).. ఆ తర్వాత బరిలోకి దిగిన జపాన్‌ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. శనివారం టోక్యోలో జరిగిన సెమీఫైనల్లో జొకో 6-3, 6-4తో వరుస సెట్లలో డేవిడ్‌ గోఫిన్‌(బెల్జియం)పై గెలిచాడు. తుదిపోరులో జాన్‌ మిల్‌మ్యాన్‌ (ఆస్ట్రేలియా)తో తలపడతాడు.

454

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles