అంతర్జాతీయ తైక్వాండో పోటీలు ప్రారంభం


Wed,June 12, 2019 12:41 AM

Srinivas-Goud
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం గచ్చిబౌలీ స్టేడియంలో రెండో అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే అవసరమని గుర్తు చేశారు. టోర్నీకి రాష్ట్ర ప్రభు త్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ప్రభాత్‌కుమార్ శర్మ, రాష్ట్ర తైక్వాండో సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

186

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles