ఈషాసింగ్‌కు కాంస్యం


Sat,July 20, 2019 12:43 AM

ranbir-isha-singh
ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్న్యూఢిల్లీ: జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ చివరి రోజు యువ షూటర్ ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల రైఫిల్ త్రీపొజిషన్‌లో స్వర్ణం సాధించడంతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. జర్మనీ వేదికగా శుక్రవారం ముగిసిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు మొత్తం 24 పతకాల (10 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు)తో టాప్‌లో నిలిచారు. చైనా 8 స్వర్ణాలతో రెండోస్థానానికి పరిమితమైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో హైదరాబాదీ ఈషాసింగ్-గౌరవ్ రాణా జంట కాంస్యం చేజిక్కించుకుంది. ప్రతాప్ సింగ్ ప్రపంచ రికార్డుతో పసిడి దక్కించుకోవడం విశేషం.

223

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles