జైపూర్, గుజరాత్ టై


Sun,September 22, 2019 12:27 AM

PKL2019
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) ఏడో సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతీ పాయింట్ కోసం ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు పోరాడుతున్నారు. శనివారం జైపూర్ పింక్ పాంథర్స్, యూపీ యోధా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 28-28తో టైగా ముగిసింది. జైపూర్ తరఫున ట్యాక్లింగ్‌లో విశాల్(9), దీపక్ హుడా(4) రాణించారు. గుజరాత్ జట్టులో సచిన్(5), పర్వేశ్ భైంస్వాల్(5) ఐదేసి పాయింట్లతో ఆకట్టుకున్నారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం జైపూర్‌దే ఆధిక్యమైనా..దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. కెప్టెన్ దీపక్ నివాస్ హుడా రైడింగ్‌లో ఆకట్టుకున్నా..సహచరుల నుంచి సహకరం కరువైంది. కీలకమైన ద్వితీయార్ధంలో పుంజుకున్న గుజరాత్..జైపూర్‌కు దీటైన పోటీనిచ్చింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 42-22తో తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది.

358

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles