కేకేఆర్‌ మెంటార్‌గా హస్సీ


Sun,October 6, 2019 01:56 AM

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఎల్‌లో జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమవడంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యాజమాన్యం మార్పులను కొనసాగిస్తున్నది. ఇటీవలే న్యూజిలాండ్‌ స్టార్‌ మెక్‌కల్లమ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకున్న కేకేఆర్‌... తాజాగా కొత్త మెంటార్‌, బౌలింగ్‌ కోచ్‌ను ఎంపిక చేసింది. చీఫ్‌ మెంటార్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్‌ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌గా కివీస్‌ మాజీ పేసర్‌ కైల్‌ మిల్స్‌ను తీసుకున్నట్టు శనివారం ప్రకటించింది. ‘కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కుటుంబంలోకి డేవిడ్‌ హస్సీ, మిల్స్‌కు స్వాగతం. ఆటగాళ్లుగా, గొప్ప వ్యక్తులుగా వారి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం’ అని కేకేఆర్‌ సీఈవో, ఎండీ వెంకీ మైసూర్‌ చెప్పారు. తన కెరీర్‌లో అంతర్జాతీయ సహా అనేక లీగ్‌ల్లో మొత్తం 300లకు పైగా టీ20లు ఆడిన డేవిడ్‌ హస్సీ... 2008 నుంచి రెండేండ్ల పాటు కోల్‌కతా జట్టు తరఫున కూడా ఆడిన విషయం తెలిసిందే.

501

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles