ధోనీ కాళ్లు మొక్కిన అభిమాని!


Mon,February 11, 2019 02:26 AM

-త్రివర్ణ పతాకాన్ని కిందపడకుండా అడ్డుకున్న మహీ
MS-Dhoni
హామిల్టన్: వికెట్ల వెనుకాల ధోనీ ఎంత చురుకుగా ఉంటాడో.. అభిమానులు కొన్నిసార్లు ఆవేశంతో చేసే పనులను అడ్డుకోవడంలోనూ అంతే వేగంగా స్పందిస్తాడు. తాజాగా కివీస్‌తో మూడో టీ20లో జరిగిన ఓ సంఘటనే దీనికి ఉదాహరణ. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేతిలో త్రివర్ణ పతాకంతో ఓ అభిమాని భద్రతా వలయాన్ని ఛేదించుకుని ధోనీ వైపు పరుగెత్తుకొచ్చాడు. బంతిని సహచరుడికి అందించి వెనుకాలకు తిరిగే సమయంలో అభిమాని ఠక్కున తన చేతిలో ఉన్న పతాకాన్ని కిందపడేస్తూ వంగి మహీ కాళ్లకు దండంపెట్టాడు. ఊహించని సంఘటనకు బిత్తరపోయిన ధోనీ మెరుపు వేగంతో స్పందిస్తూ కిందపడుతున్న పతాకాన్ని పైకి తీసి సెక్యూరిటీ సిబ్బందికి అందజేశాడు. ఆ వెంటనే అభిమానిని క్షేమంగా బయటకు పంపించేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్టంపింగ్ @ 0.099 సెకన్లు


dhoni1
మహీ మరోసారి కండ్లు చెదిరే స్టంపింగ్‌తో కట్టిపడేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకుని ప్రమాదకరంగా మారిన కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను స్టంప్‌ఔట్‌తో పెవిలియన్ పంపాడు. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ముందుకొచ్చి ఆడిన సీఫెర్ట్‌ను ధోనీ 0.099 సెకన్ల వ్యవధిలో వికెట్లను గిరాటేశాడు. థర్డ్ అంపైర్ రివ్యూలో సీఫెర్ట్ కాలు గాలిలోకి ఉండటంతో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

588

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles