స్టొయినిస్ స్థానంలో మిచెల్ మార్ష్


Wed,June 12, 2019 01:06 AM

Marcus-Stoinis
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ పక్కటెముకల గాయంతో పాకిస్థాన్‌తో మ్యాచ్ కు దూరమయ్యాడు. భారత్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ స్టొయినిస్‌కు బ్యాకప్‌గా మరో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను రప్పిస్తున్నట్లు ఆసీస్ కెప్టెన్ ఫించ్ తెలిపాడు. అతడు ఎప్పటివరకు అందుబాటులో ఉండడనే విషయంపై స్పష్టత లేదు. అందుకే ముందు జాగ్రత్తగా మిచెల్ మార్ష్‌ను రప్పిస్తున్నాం. ఇప్పుడే అతడిని జట్టులోకి తీసుకోబోము. వైద్యుల నివేదిక అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాంఅని ఫించ్ అన్నాడు. గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని ఎంచుకునే అవకాశం ఐసీసీ అన్ని జట్లకు కల్పించింది. కానీ ఆ ఆటగాడు తర్వాత పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ లేకపోవడంతో తమ మేటి ఆటగాళ్ల పట్ల టీమ్‌లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరోవైపు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఆసీస్ ఓపెనర్ వార్నర్ కొట్టిన బంతి తలకు తాకి గాయపడ్డ భారత సంతతి బౌలర్ జై కిషన్ కోలుకున్నాడు

2997

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles