ఓవర్‌త్రోలపై ఎమ్‌సీసీ సమీక్ష


Sun,July 21, 2019 01:26 AM

లండన్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్లో వివాదానికి కారణమైన ఓవర్‌త్రోలపై ఓవర్‌త్రోలపై ఎమ్‌సీసీ సమీక్షమెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సీసీ) దృష్టిసారించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో కివీస్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ ఓవర్‌త్రోతో ఇంగ్లండ్ గట్టెక్కిన సంగతి తెలిసిందే. గప్టిల్ విసిరిన త్రో బెన్‌స్టోక్స్ బ్యాటుకు తాకుతూ బౌండరీకి వెళ్లడంతో అంపైర్ ధర్మసేన ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు కేటాయించడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో నిబంధనలు సవరించేందుకు ఎమ్‌సీసీ సిద్ధమైనట్లు ద సండే టైమ్స్ పత్రిక కథనంగా పేర్కొంది.


228

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles