పది వికెట్లు పడగొట్టాడు


Thu,November 7, 2019 03:14 AM

nirdesh
మేఘాలయ యువ బౌలర్ అరుదైన ఫీట్
తేజ్‌పూర్ (అస్సాం): మేఘాలయ యువ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోలా ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి భళా అనిపించాడు. అండర్-16 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో భాగంగా గురువారం ఇక్కడ నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్దేశ్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. మొత్తం 21 ఓవర్లు వేసిన నిర్దేశ్ 51 పరుగులిచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నాగాలాండ్ తొలి రోజు 113 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయగా... అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఆ రికార్డును మరెవరూ సాధించని విషయం తెలిసిందే.

674

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles