ఫైనల్లో హుస్సాముద్దీన్


Thu,October 10, 2019 12:48 AM

జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్
hussa
బద్దీ: జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన 57కిలోల బాంటమ్ వెయిట్ విభాగం సెమీఫైనల్లో హుస్సాముద్దీన్ 5-0 తేడాతో రోషన్ సైన్(రాజస్థాన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన హుస్సాముద్దీన్..ప్రత్యర్థిపై మెరుపు పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. రింగ్‌లో చురుకుగా కదులుతూ జాబ్స్, హుక్స్‌తో చెలరేగాడు. దీంతో ప్రత్యర్థి బాక్సర్ నుంచి సరైన సమాధానం లేకపోయింది. గురువారం జరిగే తుది పోరులో సచిన్ సివాచ్‌తో హుస్సాముద్దీన్ తలపడుతాడు. మిగతా విభాగాల్లో శివ తాపా(63కి), రోహిత్ తోకాస్(75కి), అంకిత్ ఖాట్న ఫైనల్లోకి ప్రవేశించారు. అసోం బాక్సర్ శివ తాపా సెమీఫైనల్లో అభిషేక్ యాదవ్‌పై అలవోక విజయంతో ఫైనల్ పోరులో నిలిచాడు. మొత్తంగా ఎనిమిది మంది సర్వీసెస్ బాక్సర్లు, ఐదుగురు రైల్వేస్ బాక్సర్లు పసిడి పోరులోకి ప్రవేశించారు.

235

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles