బోల్ట్ రికార్డు బ్రేక్ చేస్తా


Mon,August 19, 2019 03:45 AM

gurjar-1200
భోపాల్: కనీసం కాళ్లకు బూట్లు కూడా లేకుండా తారు రోడ్డుపై 100 మీటర్ల పరుగును 11 సెకన్లలో పూర్తిచేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రామేశ్వర్ గుర్జర్.. తనకు సరైన శిక్షణ ఇస్తే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డులను తిరగరాస్తానని అంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా నర్వాల్ గ్రామానికి చెందిన 19 ఏండ్ల రామేశ్వర్‌ది వ్యవసాయ కుటుంబం. ఇటీవల అతడు రోడ్డుపై పరుగులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఇటువంటి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తే దేశానికి మంచి పేరుతెస్తారంటూ ఆ వీడియోను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ట్విట్టర్ ద్వా రా ట్యాగ్ చేశారు. వివరాలు తెలియజేస్తే అతడిని అథ్లెటిక్ అకాడమీలో చేరుస్తానని రిజిజు బదులిచ్చారు. ఈ సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకన్లు) పేరిట 100 మీటర్ల ప్రపంచ రికార్డు ఉంది. నా కు సరైన శిక్షణ, సదుపాయాలు కల్పిస్తే ఆ రికార్డును బ్రేక్ చేస్తాననే నమ్మకముంది అని అన్నాడు.

487

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles