అఖిల బౌలింగ్‌పై మళ్లీ అనుమానాలు


Wed,August 21, 2019 02:33 AM

Kane-Williamson
- కివీస్‌ కెప్టెన్‌ విలిమయ్సన్‌ పైనా..

దుబాయ్‌ : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌పై మరోసారి అనుమానాలు రేగాయి. నిబంధనలకు విరుద్ధమైన బౌలింగ్‌ యాక్షన్‌ కలిగి ఉన్నాడన్న కారణంతో గతేడాది డిసెంబర్‌లో సస్పెన్షన్‌కు గురైన ధనంజయ.. తన యాక్షన్‌ను సరిచేసుకొని ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అతడి బౌలింగ్‌ యాక్షన్‌పై మ్యాచ్‌ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐసీసీకి నివేదిక పంపారు. అతడితో పాటు విలియమన్స్‌ బౌలింగ్‌ యాక్షన్‌పైనా అభ్యంతరాలు తెలిపారు. దీంతో వచ్చే నెల 2వ తేదీలోగా ఐసీసీ ఇద్దరికీ బౌలింగ్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఆ పరీక్షల ఫలితం తేలే వరకు వీరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడొచ్చు.

381

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles