చివరి నుంచి రెండో స్థానం


Thu,October 10, 2019 12:42 AM

Pro-Kabaddi

- ముగిసిన తెలుగు టైటాన్స్‌ ప్రస్థానం
- ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌
గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పోరాటం ముగిసింది. పడుతూ లేస్తూ సాగిన ప్రయాణంలో టైటాన్స్‌ చివరి మ్యాచ్‌లో ఊరట విజయాన్నందుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న తెలుగు జట్టు బుధవారం జరిగిన మ్యాచ్‌లో 41-36తో యూపీ యోధాపై గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంతో లీగ్‌లో తమ ప్రస్థానాన్ని ముగించింది. మొత్తం 22 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ 6 విజయాలు, 13 ఓటములు, 3 ‘డ్రా’లతో 45 పాయింట్లు ఖాతాలో వేసుకొని 12 జట్లలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 33-29తో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది.

585

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles