యూపీ జోరుకు ముంబా బ్రేక్


Thu,September 19, 2019 01:00 AM

pkl
పుణె : ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో ఐదు వరుస విజయాలతో జోరు మీదున్న యూపీ యోధాకు యు ముంబా బ్రేకులు వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబా 39-36 తేడాతో యూపీ యోధాపై విజయం సాధించింది. ముంబా జట్టులో డిఫెండర్లు సురేందర్ సింగ్(6పాయింట్లు), ఫాజెల్ అత్రాచలి(3పాయింట్లు) సహా రైడింగ్‌లో అభిషేక్ సింగ్ సూపర్-10తో చెలరేగారు. ప్రారంభంలో యూపీ ముందంజలోనే నడిచినా క్రమంగా ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొమ్మిదో నిమిషంలోనే ఆలౌటై యు ముంబా వెనుకబడ్డా ఆ తర్వాత డిఫెండర్లు రాణించారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి 16-15తో యూపీనే పైచేయి సాధించింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా చివర్లో అదరగొట్టిన యూ ముంబా గెలిచింది. పుణేరి పల్టాన్ - తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ 36-36తో టైగా ముగిసింది.

293

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles