సింధుకు కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం


Wed,September 11, 2019 03:46 AM

sindhu
బెంగళూరు : బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తెలుగు షట్లర్ పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన మైసూరు యువ దసరా-2019 ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాలని కర్ణాటక ప్రభుత్వం ఆమెను ఆహ్వానించింది. మైసూరులో అక్టోబర్ 1న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రావాలని స్వయంగా కర్ణాటక సీఎం యెడియూరప్ప సింధుకు లేఖ రాశారు. ప్రపంచ విజేతగా నిలువడం పట్ల ప్రశంసించారు. క్రీడాకారిణిగా మీరు దేశం గర్వపడేలా చేశారు. అంతర్జాతీయ వేదికపై మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. మీ అద్భుత విజయాలు ఎంతో మంది యువత వారి లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణ కలిగిస్తాయి. చాలా మందికి మీరు స్ఫూర్తిగా మారారు. విజేతగా నిలిచిన మిమ్మల్ని గౌరవించడం మా విధి అని లేఖలో సీఎం యెడియూరప్ప పేర్కొన్నారు.

597

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles