ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు


Wed,August 14, 2019 01:36 AM

dravid
సీవోఏ స్పష్టీకరణ

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని క్రికెట్ పరిపాలకుల కమిటీ(సీవోఏ) మంగళవారం తేల్చి చెప్పింది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా కొనసాగుతూ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్ కంపెనీకి ఉపాధ్యక్షునిగా వ్యవహరించడంపై ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో భేటీ అయిన సీవోఏ..పలు కీలక అంశాలపై చర్చించింది. సీవోఏ సభ్యుడు రవి తోగ్డె మాట్లాడుతూ రాహుల్ కేసులో ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ముడిపడి లేవు. ఎన్‌సీఏ చీఫ్‌గా అతని నియామకాన్ని మేము క్లియర్ చేశాం. జోడు పదవుల్లో కొనసాగుతూ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్లు మాకు ఎక్కడా అనిపించలేదు. ఒకవేళ బీసీసీఐ ఎథిక్స్ అఫీసర్ జస్టిస్ డీకే జైన్‌కు ఏ తరహాలోనైనా ద్రవిడ్‌కు ప్రయోజనాలు అందుతున్నట్లు అనిపిస్తే దానికి సరైన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని రవి అన్నారు.

292

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles