ఆఫ్ఘన్ అదరహో..


Tue,September 10, 2019 02:41 AM

-ఏకైక టెస్టులో బంగ్లాపై ఘన విజయం
-ఆరు వికెట్లతో రషీద్ విజృంభణ

Afghanistan
చిట్టగాంగ్: అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ఆఫ్ఘనిస్థాన్ జట్టు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తోనే సరిపెట్టుకోకుండా టెస్టుల్లోనూ అదరగొడుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ బరిలోకి దిగిన మూడో టెస్ట్‌లో విజయదుందుభి మోగించింది. తమ(10) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న బంగ్లాదేశ్(9)ను వారి సొంత ఇలాఖాలో మట్టికరిపించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (6/49) విజృంభణతో బంగ్లాతో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది. రషీద్ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 173 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆఫ్ఘన్ 224 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ టెస్టు చరిత్రలో ఆడిన తొలి మూడు టెస్టుల్లో రెండింట నెగ్గి ఆస్ట్రేలియా సరసన నిలిచింది. గతంలో భారత్ చేతిలో తొలి టెస్టు ఓడిన ఆఫ్ఘన్.. ఐర్లాండ్‌పై గెలిచి మూడో టెస్టులోనూ విజయం సాధించింది. స్పిన్నర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో మొత్తం 40 వికెట్లు నేలకూలగా.. అందులో ఒక్క వికెట్ మినహా.. మిగిలిన 39 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 136/6తో సోమవారం బంగ్లా రెండో ఇన్నింగ్స్ కొనసాగించగా.. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం ఆటంకం కలిగించింది. ఒకదశలో వరుణుడు బంగ్లాను గట్టెక్కించేలా కనిపించినా.. కాస్త తెరిపినివ్వడంతో ఆటగాళ్లు మైదానంలో దిగారు. ఆరంభం నుంచే స్పిన్ దాడి మొదలెట్టిన ఆఫ్ఘన్ 17.2 ఓవర్లలో మిగిలిన 4 వికెట్లు పడగొట్టింది.

276

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles