ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ హవా


Tue,October 8, 2019 03:06 AM

ROHIT
దుబాయ్‌: ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి టెస్టులోనే రెండు శతకాలతో (176, 126) విజృంభించిన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. టెస్టు ర్యాంకుల్లో ఒకేసారి 36 స్థానాలు ఎగబాకి కెరీర్‌ అత్యుత్తమ 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. గతంలో ఆడిన 27 టెస్టుల్లో మిడిల్‌ఆర్డర్‌లో బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌ విశాఖలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి భారత్‌ భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్‌, డబుల్‌ సెంచరీ హీరో మయాంక్‌ అగర్వాల్‌ సైతం 38 స్థానాలు మెరుగుపరుచుకొని 25వ ర్యాంకుకు చేరాడు. ఇక టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రర్యాంకును నిలబెట్టుకున్నాడు. వైజాగ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లోకి తిరిగొచ్చాడు. 14వ స్థానం నుంచి 10కి చేరుకున్నాడు. పేసర్‌ షమీ రెండు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు చేరాడు.

745

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles