టీఎన్‌సీఏ ప్రెసిడెంట్‌గా రూప


Mon,September 23, 2019 01:11 AM

RUPA
చెన్నై: భారత క్రికెట్ నియంత్రణా మండ లి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. బరిలో కేవలం రూప మాత్రమే ఉండటంతో ఆమెను విజేతగా ప్రకటించారు. ఎన్నో ఏండ్లుగా తమిళనాడు క్రికెట్‌పై తనదైన ముద్రవేస్తూ వస్తున్న శ్రీనివాసన్.. ఈ ఎన్నిక ద్వారా మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి.. చెన్నై జట్టు రెండేండ్లు నిషేధం ఎదుర్కోవడానికి కారణమైన అప్పటి టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మయప్పన్ భార్యే ఈ రూపా గురునాథ్.

235

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles