సైనా నిష్క్రమణ


Thu,September 19, 2019 01:02 AM

- సింధు, ప్రణీత్, కశ్యప్ శుభారంభం
siana
చాంగ్‌జౌ : ఎన్నో ఆశలతో చైనా ఓపెన్ బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేతలు పీవీ సింధు, సాయి ప్రణీత్‌తోపాటు కశ్యప్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా 10-21, 17-21 తేడాతో బుసానన్ అంగ్బమ్‌రంగ్పన్(థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. గాయం కారణంగా ఆమె స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినట్టుగా కనిపించింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 21-18, 21-12తో లీ షుయెరూ(చైనా)పై 34 నిమిషాల్లో విజయం సాధించింది. చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 21-19, 21-23, 21-14తేడాతో అవిహింగ్‌సనన్(థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రాష్ట్ర యువ షట్లర్ సిక్కిరెడ్డి, అశ్వినీ పొన్నప్ప జోడీ గెలువగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం సిక్కిరెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా ద్వయం ఓడింది.

249

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles