అజర్‌ కొడుకుతో సానియా చెల్లి నిఖా


Tue,October 8, 2019 03:09 AM

SANIA
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఇంట త్వరలోనే పెండ్లి సందడి మొదలుకానుంది. అజర్‌ కుమారుడు అసద్‌తో తన చెల్లి ఆనమ్‌ మీర్జా వివాహం డిసెంబర్‌లో జరుగనుందని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వెల్లడించింది. ‘ఆనమ్‌ వివాహం డిసెంబర్‌లో జరుగనుంది. మేం ఇప్పుడే పారిస్‌ పర్యటన నుంచి వచ్చాం. ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఆజారుద్దీన్‌ కుమారుడు అసద్‌తో ఆనమ్‌ పెండ్లి జరుగనుండడం చాలా సంతోషంగా ఉంది’ అని సానియా జాతీయ మీడియాతో చెప్పింది. ఆనమ్‌ మీర్జా ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నది. చాలా ఈవెంట్లలో సానియాకు ఆమె డ్రెస్‌ డిజైనింగ్‌ చేస్తున్నది. ఓ సందర్భంలో ఆనమ్‌, అసద్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో సానియా పోస్ట్‌ చేసి ఫ్యామిలీ అని రాసింది. అప్పటి నుంచి అసద్‌, అనమ్‌కు పెండ్లి జరుగనుందనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. తాజాగా సానియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

2685

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles