సరితా దేవి ఔట్‌


Mon,October 7, 2019 03:53 AM

sarita
ఉలాన్‌ ఉదే (రష్యా): ప్రపంచ మాజీ చాంపియన్‌, భారత సీనియర్‌ బాక్సర్‌ ఎల్‌.సరితా దేవి మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్‌లో బై లభించగా... ఆదివారం రెండో రౌండ్‌లో బరిలోకి దిగిన సరిత (60 కేజీలు) 0-5తో నటాలియా షద్రినా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. బౌట్‌ తొలి మూడు నిమిషాలు సరిత బలమైన పంచ్‌లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత రెండు రౌండ్లలో రష్యా బాక్సర్‌ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో సరితకు ఓటమి తప్పలేదు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగిన నందిని (81కేజీలు) 0-5తో ఇరీనా నికోలెటా (జర్మనీ)పై కనీస పోరాటం కనబరచకుండానే పరాజయం పాలైంది. ఇప్పటికే భారత మహిళా బాక్సర్లు సవీటి బూర (75కేజీలు), జమునా బోరో (54కేజీలు) చాంపియన్‌షిప్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరారు.

214

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles