హాకీ చాంప్ రంగారెడ్డి


Thu,November 7, 2019 03:39 AM

kamaredd
విద్యానగర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) రాష్ట్ర స్థాయి బాలికల హాకీ టోర్నమెంట్‌లో రంగారెడ్డి విజేతగా నిలిచింది. అండర్-17 బాలికల ఫైనల్లో రంగారెడ్డి జట్టు 2-0తో నిజమాబాద్‌ను చిత్తుచేసి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది ప్లేయర్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రంగారెడ్డి నుంచి అశ్విని, రక్షిత, శిరీష, శివనందిని.. నిజామాబాద్ నుంచి విఠాబాయి, సుజిత, హాసినీ ప్రియ, నవీత.. మహబూబ్‌నగర్ నుంచి గంగోత్రి, మౌనిక.. ఆదిలాబాద్ నుంచి రుషితా రెడ్డి, ఉమ.. వరంగల్ నుంచి అనూష.. కరీంనగర్ నుంచి శైలజ.. ఖమ్మం నుంచి సుష్మిత.. నల్లగొండ నుంచి పావని.. హైదరాబాద్ నుంచి కావేరి.. మెదక్ నుంచి మేఘన జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.

132

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles