శివ థాపాకు స్వర్ణం


Sun,July 21, 2019 01:54 AM

ranbir-Shiva
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ శివ థాపా (63 కేజీలు) చరిత్ర సృష్టించాడు. ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తొలి స్వర్ణం నెగ్గిన భారతీయ బాక్సర్‌గా రికార్డు నెలకొల్పాడు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో శనివారం జరగాల్సిన ఫైనల్లో ప్రత్యర్థి జాకీర్ సఫిఉల్లిన్ (కజకిస్థాన్) గాయం కారణంగా వాకోవర్ ఇవ్వడంతో థాపా విజేతగా నిలిచాడు.

ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించిన థాపా.. టోక్యో ఒలింపిక్స్‌లో తాను ఎప్పుడూ పాల్గొనే 60 కేజీల విభాగం లేకపోవడంతో బరువు పెరిగి 63 కేజీల కేటగిరీ బరిలో దిగాడు. కొత్త కేటగిరీకి త్వరగానే అలవాటు పడ్డా. కాస్త ఇబ్బంది ఎదురైనా.. అదేమంత కష్టం కాలేదు. ఎక్కువ వెయిట్ బాక్సర్లతో తలపడటం సవాలుతో కూడుకున్నదే అయినా అసాధ్యమేమీ కాదుఅని థాపా అన్నాడు. మహిళల 60 కేజీల విభాగంలో పర్వీన్ రజతం సాధించింది. ఆమె ఫైనల్లో రిమ్మా వొలొసెన్కో (కజకిస్థాన్) చేతిలో ఓడింది.

332

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles