టాప్‌లోనే జులన్, మందన


Sat,March 23, 2019 02:08 AM

mandana
దుబాయ్: భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మందన, జులన్ గోస్వామి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. శుక్రవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో మందన(797)టాప్ ర్యాంక్‌లో ఉండగా, మిథాలీరాజ్(713) నాలుగో ర్యాంక్‌లో ఉంది. ఫార్మాట్‌తో సం బంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న మందన వన్డేల్లో తన ఆధిపత్యాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. ప్రత్యర్థి ఎవరైనా తన జోరు కొనసాగిస్తూ జట్టు విజయాల్లో కీలకమవుతున్నది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సీనియర్ జులన్ గోస్వామి(730) తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. శిఖాపాండే (688), పూనమ్ యాదవ్(656) వరుసగా ఐదు, పది ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల కేటగిరీలో దీప్తిశర్మ(388) మూడో ర్యాంక్‌లో ఉంది. జట్ల విషయానికొస్తే ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా(22), ఇంగ్లండ్(18) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

569

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles