జైట్లీకి క్రీడా లోకం సంతాపం


Sun,August 25, 2019 01:52 AM

Arun
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి క్రీడా లోకం సంతాపం వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య పరిస్థితులతో సతమతమైన జైట్లీ శనివారం మరణించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా క్రీడల పట్ల తన అభిమానాన్ని చాటుకున్న జైట్లీ మరణానికి పలువురు ప్రముఖ క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాప సందేశాలు ఉంచారు. భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతం గంభీర్..జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు. మరోవైపు తనకెంతో ఆత్మీయుడైన జైట్లీని కోల్పోవడం తీరని లోటు అంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. వీరితో పాటు టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెహ్వాగ్, ధవన్, యువరాజ్‌సింగ్, మిథాలీరాజ్, అశ్విన్, సుశీల్ కుమార్, మేరికోం సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే వాళ్లలో అరుణ్ జైట్లీ ఒకరు. అభిమానిగానే గాకుండా పాలనాధికారిగా క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించిన వ్యక్తి. జైట్లీ హయంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

568

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles