నిర్మలపై నాలుగేండ్ల నిషేధం


Thu,October 10, 2019 12:39 AM

nirmala
మొనాకో: డోపింగ్‌ టెస్టులో పట్టుబడ్డ భారత స్పింటర్‌ నిర్మలా షెరాన్‌పై నాలుగేండ్ల నిషేధం పడింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కారణంగా ఆమెపై బ్యాన్‌ విధించినట్లు అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నిషేధం 2018 జూన్‌ 18 నుంచి అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. దీంతో 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె సాధించిన రెండు స్వర్ణ పతకాలు రద్దయ్యాయి. క్రమపద్ధతిలో రక్త నమూనాలు కూడా సమర్పించని నిర్మలకు ఈ విషయంలో.. వివరణ ఇచ్చుకునేందుకు కూడా ఏఐయూ అవకాశం ఇవ్వలేదు. అంతే కాకుండా 2016 ఆగస్టు నుంచి 2018 నవంబర్‌ వరకు అంటే డోప్‌ పరీక్షలకు రెండేండ్ల ముందు ఆమె సాధించిన పతకాలను కూడా రద్దు చేసినట్లు స్పష్టంచేసింది.

346

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles