లంక ఘన విజయం


Mon,August 19, 2019 03:47 AM

-సెంచరీతో గెలిపించిన కెప్టెన్ కరుణరత్నె
dimut
గాలె: సొంతగడ్డపై శ్రీలంక చక్కటి ప్రదర్శనతో చెలరేగింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో లంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో పాయింట్ల ఖాతా తెరిచింది. కెప్టెన్ దిముత్ కరణరత్నే (243 బంతుల్లో 122; 6 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుత సెంచరీకి మరో ఓపెనర్ తిరిమన్నె (64) అర్ధశతకం తోడవడంతో లంక రెండో ఇన్నింగ్స్‌లో 86.1 ఓవర్లలో 4 వికెట్లకు 268 పరుగులు చేసి గెలుపొందింది. గాలెలో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కాగా.. గతంలో ఇక్కడ నాలుగో ఇన్నింగ్స్ ఆడుతూ ఏ జట్టూ 99 పరుగులకు మించి టార్గెట్‌ను ఛేజ్ చేయక పోవడం గమనార్హం. కరుణరత్నెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఓవర్‌నైట్ స్కోర్ 133/0తో చివరిదైన ఐదోరోజు ఆట కొనసాగించిన లంక ఒక్కో పరుగు జతచేస్తూ లక్ష్యాన్ని కరిగించుకుంటూ వెళ్లింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్నా ఎక్కడా తడబాటుకు గురికాకుండా పట్టుదలతో నిలిచిన కెప్టెన్ కరుణరత్నె సెంచరీతో ఆకట్టుకోవడంతో ఆదివారం తొలి సెషన్‌లోపే ఆట ముగిసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేయగా.. లంక 267 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 285 పరుగులకు పరిమితమవగా.. 268 పరుగుల లక్ష్యాన్ని లంక 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

353

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles