పాలమూరులో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు


Mon,April 15, 2019 02:24 AM

karate
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: కేబీఐ బుడోకాన్ డూ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పద్మాచారి, లుంబినీ స్కూల్ డైరెక్టర్ లక్ష్మణ్‌గౌడ్, రఘువీర్ ప్రతాప్, కేబీఐ ఆసియా చీఫ్ పరమేశ్ అతిథులుగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని సూచించారు. టోర్నీలో మొత్తం 120 మంది విద్యార్థులు పోటీపడగా, 40 మందికి స్వర్ణాలు, 40 మందికి రజతాలు, 20 మందికి కాంస్య పతకాలు దక్కినట్లు టోర్నీ నిర్వాహకుడు మాస్టర్ రవికుమార్ తెలిపారు.

242

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles