సూపర్ స్మిత్


Wed,November 6, 2019 12:20 AM

- రెండో టీ20లో పాక్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా
smith
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (80 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో అదరగొట్టడంతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దుకాగా.. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50; 6 ఫోర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (34 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో.. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ పాక్ పోరాడే స్కోరు చేయగలిగింది. అయితే టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్లు వార్నర్ (20), ఫించ్ (17) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్మిత్ రాణించడంతో ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆసీస్ ముందంజ వేసింది.

450

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles