భారత్ X ఖతార్


Tue,September 10, 2019 02:36 AM

-ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్
sunil
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఒమన్ చేతిలో ఓటమి పాలైన సునీల్ ఛెత్రీ సేన మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో ఆసియా చాంపియన్ ఖతార్‌ను ఢీకొననుంది. తొలి మ్యాచ్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న భారత్.. చివరి ఎనిమిది నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థికి రెండు గోల్స్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ (103)కంటే ఎంతో మెరుగ్గా ఉన్న ఖతార్ (62)ను ఓడించడం ఛెత్రీ సేనకు శక్తికి మించిన పనే అని చెప్పొచ్చు. గతంలో ఇరు జట్ల మధ్య 4 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగ్గా.. అందులో మూడింట ఖతార్ నెగ్గింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ (2007)లో ఖతార్ 6-0తో భారత్‌ను చిత్తు చేసింది. ప్రస్తుత టోర్నీలో ఖతార్ త మ తొలి మ్యాచ్‌లో 6-0తో ఆఫ్ఘనిస్థాన్‌ను మట్టికరిపించి మంచి ఊపు మీద ఉంది. మరి ఖతార్ జోరును మనవాళ్లు అడ్డుకుంటారా లేదో చూడాలి.

240

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles