వరల్డ్ చాంపియన్‌షిప్‌కు రెజ్లర్ సుశీల్


Wed,August 21, 2019 02:20 AM

sushil
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ బెర్త్ దక్కించుకున్నాడు. ఏడాది కాలంగా మ్యాట్‌కు దూరంగా ఉన్న సుశీల్ ఇటీవల బెలారస్ టోర్నీ బరిలో దిగి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే తాజాగా నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో మాత్రం సుశీల్ సత్తాచాటాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో మంగళవారం సుశీల్ 4-2తో జితేందర్ కుమార్‌పై విజయం సాధించాడు. తొలి రౌండ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సుశీల్.. ఆ తర్వాత పట్టు వదలకుండా జోరు కొనసాగించాడు. జితేందర్ రెండు పాయింట్లు సాధించి పోటీలోకి వచ్చేందుకు ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు.

229

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles