భారత్ ఎలెవెన్ పైచేయి


Mon,August 19, 2019 03:41 AM

- విండీస్-ఏ 181 ఆలౌట్
Rohit
అంటిగ్వా: సంప్రదాయ క్రికెట్‌లో తొలిసారి జెర్సీలపై నంబర్లు, పేర్లతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు వెస్టిండీస్-ఏతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో అదరగొడుతున్నారు. మ్యాచ్ రెండో రోజు ఆదివారం భారత బౌలర్లు ఇషాంత్ శర్మ(3/21), ఉమేశ్ యాదవ్(3/19), కుల్‌దీప్ యాదవ్(3/35) సమిష్టిగా చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో విండీస్-ఏ జట్టు 181 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ కవెమ్ హాడ్జ్(100 బంతుల్లో 51) ఒక్కడే రాణించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అంతకు ముందు తొలిరోజు బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా(187 బంతుల్లో 100, రిటైర్డ్) సహా రోహిత్ శర్మ(115 బంతుల్లో 68) రాణించడంతో 297/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ఎలెవెన్ డిక్లేర్ చేసింది.

556

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles