ఈనెల 21 నుంచి తెలంగాణ క్రికెట్ కప్


Thu,September 12, 2019 04:51 AM

t-cup
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), డైకిన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ క్రికెట్ కప్ టోర్నీ ఆరో ఎడిషన్ ఈనెల 21 నుంచి మొదలుకాబోతున్నది. కార్పొరేట్ రంగంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 32 జట్లు నెల రోజు పాటు మైదానంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. వారాంతాల్లో జరిగే మ్యాచ్‌లకు జంటనగరాల్లోని పలు క్రీడా మైదానాలు వేదికకాబోతున్నాయి. బుధవారం జరిగిన కప్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్(టీఎస్‌ఐఐసీ) ఎండీ ఈవీ నరసింహా రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్మన్ డీ రాజు, యూ కే డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ సర్వలక్ష్మి, అంపైర్ శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహా రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాలను కలుపుతూ క్రికెట్ టోర్నీ ఏర్పా టు చేసిన సీఐఐని అభినందించారు. హోదాలతో సంబంధం లేకుండా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను ఒక చోట చేర్చేందుకు ఇలాంటి టోర్నీలు ఉపయోగపడుతాయని రెడ్డి అన్నారు. కార్పొరేట్ లీగ్ తరహాలోనే మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించాలని ఫ్లెమింగ్ సూచించారు.

287

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles