కూత కాదు కోతే...


Sat,July 20, 2019 02:04 AM

ranbir-pk

-నేటి నుంచి ప్రొ కబడ్డీ సీజన్ -7
-బరిలో దిగనున్న 12 జట్లు
-గచ్చిబౌలి వేదికగా తొలి మ్యాచ్‌లో యు ముంబాతో తెలుగు టైటాన్స్ ఢీ
-స్టార్ అట్రాక్షన్‌గా కబడ్డీ బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్
-సాయంత్రం 7గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్స్టార్ మాలో ప్రత్యక్ష ప్రసారం

హైదరాబాద్ నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి:మట్టి నుంచి మ్యాట్‌పైకి వచ్చిన క్రీడ.. మీరు నేనూ అంతా చిన్నప్పుడు ఆడిందే. పాతతరం బురద మడుల్లో ఆడితే.. ప్రస్తుతం ఫ్లడ్‌లైట్ల వెలుగులోకి చేరింది. క్షణకాలంలో ఆధిక్యం చేతులు మారడంలో ఈ ఆటకు మించింది మరోటి లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ స్థాయిలో ఫుట్‌బాల్, క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ లేకున్నా.. మన దేశంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కబడ్డీ ఆటకు వేళైంది. గల్లీ క్రీడకు అగ్రతాంబూలం ఇస్తూ.. ఇప్పటికే ఆరు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌కు సిద్ధమైంది. 12 జట్లు.. 92 రోజులు.. 137 మ్యాచ్‌లతో సుదీర్ఘంగా సాగే ఈ లీగ్.. తొలి మ్యాచ్‌లో యు ముంబాతో గచ్చిబౌలి స్టేడియంలో లోకల్ టీమ్ తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

12 నగరాల్లో పదకొండేసి మ్యాచ్‌లు

లీగ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న 12 ప్రాంచైజీల సొంత మైదానాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే 12 అంచెల్లో పోటీలు నిర్వహిస్తారు. ప్రతీ నగరంలో 11 మ్యాచ్‌ల చొప్పున మొత్తం 132 లీగ్ మ్యాచ్‌లు. పాయింట్ల పట్టిక ఆధారంగా తొలి 6 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయి. మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరెట్స్ పూర్వ వైభవం సాధించాలని పట్టుదలగా ఉంది.

టోర్నీ సాగుతుందిలా..

మొత్తం 12 జట్లను రెండు జోన్‌లుగా విభజిస్తారు. ప్రతీ జట్టు ఇతర జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అంటే క్రికెట్‌లో రౌండ్ రాబిన్ పద్ధతిలా. కానీ అక్కడ ఒక జట్టు.. ప్రత్యర్థితో ఒకేసారి తలపడితే.. పీకేఎల్‌లో మాత్రం రెండు సార్లు అమీతుమీ తేల్చుకుంటుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ అన్నమాట. జోన్‌లో అగ్రస్థానంలో నిలిచిన మూడేసి జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చెరితే.. 3 నుంచి 6వ స్థానం వరకు ఉన్న నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి.

ranbir-malli
తెలుగు టైటాన్స్‌లో మన మల్లిఖార్జున్

సత్తాచాటేందుకు సిద్ధమైన ఆత్మకూరు యువకుడు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: కబడ్డీ.. కబడ్డీ పక్కా మాస్ గేమ్. బరిలోకి దిగారంటే గిరిగీసి కొట్లాడాల్సిందే. కూతకు వెళ్లినా.. ప్రత్యర్థి ఆటగాన్ని పట్టుపట్టినా మన ప్రతాపమేంటో చూపాల్సిందే. ఇన్నాళ్లు గ్రామీణ ప్రాం తాలకు పరిమితమైన కబడ్డీ.. ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పుణ్యమా అని కార్పొరేట్ హంగులతో నగర అభిమానులకు సరికొత్త కిక్కిచ్చేందుకు సర్వహంగులతో సిద్ధమైంది. అయితే గత ఆరు సీజన్లలో మన తెలంగాణ నుంచి ఎవ రూ లేరా.. ఉన్నా అవకాశాలు రాక వెలుగులోకి రాలేదేమో కానీ ఈసారి పీకేఎల్ సీజన్‌లో మెరుపులు మెరిపించేందుకు మన పాలమూరు ముద్దుబిడ్డ పల్లె మల్లిఖార్జున్ రెడ్డి సై అంటున్నాడు. శనివారం నుంచి హైదరాబాద్ వేదికగా మొదలయ్యే పీకేఎల్ ఏడో సీజన్‌లో మల్లిఖార్జున్.. తెలుగు టైటాన్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.

వనపర్తి జిలా ఆత్మకూరు మండలం మూలమళ్ల గ్రామానికి చెం దిన మల్లిఖార్జున్ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్ననాటి నుంచి కబడ్డీ క్రీడలో ఎంతో కష్టపడి రాణించా డు. మారుమూల గ్రామం నుంచి వచ్చినా అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వరుసగా ఐదేండ్లు జాతీయస్థాయిలో ఉత్తమంగా రాణించిన ఈ యువ రైడర్ తొలిసారి ప్రొ కబడ్డీకి ఎంపికయ్యాడు. కబడ్డీ క్రీడతోనే స్పోర్ట్స్ కోటాలో ఉద్యో గం సాధించిన మల్లి.. అంతటితో ఆగకుండా రైల్వే శాఖ మద్దతుతో జాతీయ స్థాయిలో సత్తాచాటుతూ వచ్చా డు. మల్లిఖార్జున్ పీకేఎల్‌లోనూ మెరుపులు మెరిపించాలని ఆశిద్దాం.

ranbir-siddarth(big-size)

ఆట కాదు వేట

గ్రామీణ క్రీడకు ప్రేక్షకుల్లో మరింత ఆదరణ పెంచేందుకు వీవో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 కోసం స్టార్ స్పోర్ట్స్-1 తెలుగు నిర్వాహకులు టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక ప్రోమో సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కోర్టులో కబడ్డీ బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ కేక పుట్టిస్తుంటే.. మైదానం బయట ఉన్న ఎన్టీఆర్ చూసేవాడికి అది ఆటేనేమో కానీ.. ఆడేవాళ్లకు అది వేటఅనడం ఆసక్తికరంగా కనిపిస్తున్నది.

ముఖాముఖిఆడినమ్యాచ్‌లు 10
టైటాన్స్ గెలిచినవి 4
ముంబా నెగ్గినవి 4
ఫలితం తేలనివి 2


టైటాన్స్ x ముంబా

ఆరు సీజన్లుగా తెలుగు టైటాన్స్ ప్రధాన ఆటగాడైన రాహుల్ చౌదరిని ఈ సారి వేలంలో తమిళ్ తలైవాస్ సొంతం చేసుకోగా.. గతేడాది యు ముంబా తరఫున బరిలో దిగి ఉత్తమ అరంగేట్ర ఆటగాడిగా నిలిచిన సిద్ధార్థ్ దేశాయ్‌ను టైటాన్స్ చేజిక్కించుకుంది. లీగ్‌లో ఆరు సీజన్లు పూర్తైనా.. ఇప్పటి వరకు ఒక్క సారి కూడా విజేతగా నిలువలేకపోయిన టైటాన్స్.. ఈ సారి సిద్ధార్థ్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. యు ముంబా తరఫున ఆరో సీజన్‌లో 218 పాయింట్లు సాధించిన సిద్ధార్థ్ తొలి మ్యాచ్‌లో తన పాత జట్టుపై విరుచుకుపడాలని భావిస్తున్నాడు. రైడింగ్‌లో సిద్ధార్థ్ తురుపు ముక్కైతే.. డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్, అబోజర్ మిఘానిపైనే జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురు కలిసి కట్టుగా రాణిస్తే.. టైటాన్స్‌కు తిరుగుండదు. ఇక మిగిలిన వారిలో.. కమల్ సింగ్, సూరజ్, అరుణ్‌తో పాటు పాలమూరు ముద్దుబిడ్డ మల్లిఖార్జున్ కీలకం కానున్నారు. మరోవైపు 2వ సీజన్‌లో విజేతగా నిలిచిన యు ముంబా ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి.

ప్రస్తుతం కెప్టెన్ ఫజల్ అట్రాచలి నాయకత్వంలో చెలరేగాలని ఆ జట్టు తహతహలాడుతున్నది. సందీప్ నర్వాల్, సురేందర్ సింగ్, యాంగ్ చాంగ్ కో, రోహిత్ బలియాన్, డాంగ్ లీతో ఆ జట్టు బలంగా ఉంది. తమ జట్టు పాత సభ్యుడు సిద్ధార్థ్ దేశాయ్‌ను అడ్డుకుంటే టైటాన్స్‌ను మూయడం పెద్ద పనేం కాదు అని ఫజల్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. మరి తొలి పోరులో పైచేయి ఎవరిదో చూడాలి.

హైదరాబాద్ అంచె పోటీల వివరాలు
ranbir-tablel

652

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles