ఆసీస్‌కు లంక పోటీనిచ్చేనా?


Sat,June 15, 2019 02:00 AM

లండన్: వర్షం కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో బరిలో దిగలేకపోయిన శ్రీలంక నేడు పటిష్ఠ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. పదును తగ్గిన పేస్ బౌలింగ్.. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్‌తో సతమతమవుతున్న లంక.. అన్ని విభాగాల్లో కుదురుకున్న ఆసీస్‌కు ఏ మేరకు పోటినిస్తుందో చూడాలి. రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో గత పది రోజులుగా మైదానానికి దూరంగా ఉన్న లంకేయులు ఈ మ్యాచ్‌లో చెలరేగాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే, మాథ్యూస్, మెండీస్, పెరెరా కీలకం కాగా.. బౌలింగ్‌లో తురుపుముక్క మలింగే దిక్కు. మరోవైపు పాకిస్థాన్‌పై విజయంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. లంకను చితక్కొట్టి ముందుకు సాగాలని భావిస్తున్నది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫుల్ ఫామ్‌లోకి రాగా.. ఫించ్, స్మిత్ మంచి టచ్‌లో ఉన్నారు. స్టార్క్, కమ్మిన్స్, కౌల్టర్‌నైల్‌తో బౌలింగ్ విభాగం భీకరంగా కనిపిస్తున్నది. బౌన్సర్లతో బెంబేలెత్తించే ఈ త్రయాన్ని లంక బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కుంటుందనేదానిపై మ్యాచ్ ఫలి తం ఆధారపడి ఉంది.
Warner

దక్షిణాఫ్రికా దశ మారేనా..

హాట్ ఫేవరెట్‌గా కాకున్నా.. మంచి బలం, బలగంతో ప్రపంచకప్ బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఆడిన నాలు గు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన సఫారీలు ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి బోణీ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్, బంగ్లాదేశ్, భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. వరుణుడి కారణంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఖాతా తెరవగలిగింది. సెమీస్‌కు చేరాలంటే ఇక్కడి నుంచి అన్ని మ్యాచ్‌లు నెగ్గాల్సిన స్థితిలో ఉన్న డుప్లెసిస్ సేన నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. డికాక్, డుప్లెసిస్, డుమిని, డస్సెన్, మార్క్మ్,్ర ఆమ్లా, మోరిస్, మిల్లర్ ఇలా చూడడానికి అన్ని పెద్ద పేర్లే ఉన్నా సఫారీలు ఇప్పటివరకు స్థాయికి తగ్గట్లుగా రాణించింది లేదు. స్పిన్ ఆడటంలో తడబడే ప్రొటీస్ బ్యాట్స్‌మెన్.. రషీద్, నబీ, ముజీబ్‌ను ఎలా ఎదుర్కుంటారనేది ఆసక్తికరం. పెద్ద జట్లతో ఆడే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని బీరాలు పలికిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఇప్పటి వరకు ఎలాంటి సంచలనాలు నమోదు చేయలేకపోయారు.

440

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles