గోవాపై గెలుపు


Tue,October 8, 2019 02:38 AM

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హైదరాబాద్‌ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాయుడు సేన 5 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. మహమ్మద్‌ సిరాజ్‌ (4/20), భావనక సందీప్‌ (4/13) ధాటికి టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన గోవా 37.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. అమోఘ్‌ దేశాయ్‌ (55) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగిలినవారు పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (66 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో హైదరాబాద్‌ 22.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 53 పరుగుల తేడాతో కర్ణాటక చేతిలో ఓడింది

84

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles