కరీంనగర్‌లో వాకో ఇండియా కిక్ బాక్సింగ్ టోర్నీ


Mon,August 19, 2019 03:43 AM

boxing
కరీంనగర్ స్పోర్ట్స్: జాతీయ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కరీంనగర్ వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు జరుగనున్న ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కిక్ బాక్సర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడెట్, జాతీయ స్థాయి జూనియర్ పోటీలు మొదటిసారిగా కరీంనగర్‌లో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ చైర్మన్ శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్ ఆర్. ప్రసన్నకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, తెలంగాణ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ప్రధాన కార్యదర్శి మహిపాల్, ఉపాధ్యక్షుడు బాలాజీ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

225

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles