ప్రపంచకప్ నా చేతుల్లో ఉండాలి


Fri,June 14, 2019 02:45 AM

hardik
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, జట్టు గెలువాలన్నదే కోట్లాది మంది భారతీయుల కోరిక అని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ముచ్చటగా మూడోసారి తమ కలల కప్‌ను ముద్దాడాలనుకుంటున్న టీమ్‌ఇండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అంచనాలకు తగ్గట్లు కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ పోస్ట్ చేసిన వీడియోలో హార్దిక్ పలు అం శాలను పంచుకున్నాడు. జూలై 14న ప్రపంచకప్ నా చేతుల్లో ఉండాలని కోరుకుంటాను. నా ప్లాన్ చాలా సింపుల్.. వరల్డ్‌కప్ గెలువాలన్నదే తపన. భారత్ అంటే నాకు అన్నీ. మూడున్నర ఏండ్లుగా మెగాటోర్నీ కోసం సిద్ధమవుతున్నా. ఇప్పుడు సమయమొచ్చింది. నా జీవితం లో ఇప్పటివరకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కానీ వాటితో గిపోవాలనుకోవడంలేదు. చాలా కష్టపడి ఈ స్థాయి కి చేరుకున్నాను. అవును 2011 ప్రపంచకప్ భారత్ గెలిచినప్పుడు అర్ధరాత్రి పూట దోస్తులతో కలిసి వీధుల్లో సంబురాలు చేసుకున్నాం. అంత మంది రోడ్లపైకి వచ్చి పండుగలా సంబురాలు చేసుకున్నారు. ఏదో ఒక రోజు టీమ్‌ఇండియాకు ఆడాలనుకున్నాను. సరి గ్గా ఎనిమిదేండ్ల తర్వాత ప్రపంచకప్ ఆడే భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాను అని హార్దిక్ అన్నాడు.

2595

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles