విండీస్ విలవిల!


Mon,August 26, 2019 02:11 AM

బుమ్రా, ఇషాంత్ విజృంభణ .. లక్ష్యఛేదనలో 15/5
Bumrah
నార్త్‌సౌండ్(అంటిగ్వా): వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌పై భారత్ మరింత పట్టు బిగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ భారీ విజయంపై కన్నెసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 419 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ టీ విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. విండీస్‌ను బుమ్రా (3/6) ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ కొట్టాడు. తన తొలి ఓవర్లోనే బ్రాత్‌వైట్(1) స్వింగ్ డెలీవరీతో ఔట్ చేసి వికెట్ల వేట తెరతీశాడు. బ్రాత్‌వైట్‌ను అనుసరిస్తూ జాన్ క్యాంప్‌బెల్(7), బ్రూక్స్(2), హెట్‌మైర్(1) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. క్యాంప్‌బెల్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేస్తే..బ్రూక్, హెటెమైర్‌ను ఇషాంత్(2/8) పెవిలియన్ పంపాడు.

దీంతో స్కోరుబోర్డుపై పరుగుల కంటే వికెట్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోయింది. ఇదే అదునుగా మరింత జోరు పెంచిన బుమ్రా..బ్రావో(2)ను కండ్లు చెదిరే బంతితో క్లీన్‌బౌల్డ్ జుట్టు సహచరులతో కలిసి సంబురాల్లో మునిగి తేలాడు. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్న విండీస్ 404 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 185/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 343/7 వద్ద డిక్లేర్ చేసింది. రహానే(102) సెంచరీతో అదరగొట్టగా, తెలుగు క్రికెటర్ హనుమ విహారి(93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోస్టన్ చేజ్(4/132)నాలుగు వికెట్లు తీశాడు.

823

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles