ఆశ్చర్యం కలిగించింది : ఐటా


Fri,November 8, 2019 02:16 AM

న్యూఢిల్లీ : డేవిస్‌కప్‌లో భాగంగా పాక్‌లో ఆ జట్టుతో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికకు మార్చే దిశగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మూడు నెలల పాటు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని, అయితే అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం తమకు ఆశ్చ ర్యం కలిగించిందని భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది. ఇస్లామాబాద్ వేదికగా ఉండడం వల్ల అక్కడికి వెళ్లేందుకు అంగీకరించలేదన్న కారణంతో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా మహేశ్ భూపతిని ఐటా తప్పించింది. ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే పాక్‌తో భారత మ్యాచ్‌లను ఐటీఎఫ్ తటస్థ వేదికకు మారుస్తున్నట్టు ప్రకటించింది. వేదిక మార్పు నిర్ణయం.. ఐటా పోరా ట, దౌత్య విజయం. అయితే, మూడు నెలలుగా తటస్థ వేదికపై ఐటీఎఫ్ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఒకవేళ ఐటీఎఫ్ అంగీకరించకపోతే పాక్‌కు భారత జట్టు వెళ్లకూడదని మహేశ్ భూపతి సూచించాడు. వెళ్లకపోతే మ న జట్టు ఓడినట్లే అవుతుంది. నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ కోసం మహేశ్ స్వయంగా ఏడుగురి పేర్లను సూచించాడు అని ఐటా సీఈవో బిశ్వదీప్ చెప్పారు. ఈనెల 29,30 తేదీల్లో పాక్‌తో భారత జట్టు తలపడనుండగా.. వేదికను ఐపీఎఫ్ త్వరలోనే నిర్ణయించనుంది.

352

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles